వేణుగోపాల్ అన్న కు అభినందనలు తెలియజేసిన బి.బి.యన్ యోగ సాధన సభ్యులు
సాక్షిత : ఇటీవల విజయవాడ, తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రమునందు జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు-2025 భాగంగా కోహేన్స్ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సహకారంతో మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ నిర్వహణ సారధ్యములో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో సమాజ సేవా కార్యక్రమాల పట్ల ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను జాతీయ ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న శుభసందర్భంగా , బుజబుజనెల్లూరు లోని శేషు ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆవరణమునందు బుజబుజనెల్లూరు యోగ సాధన సభ్యులు జిల్లా పీఎంపీ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు అవధానం సతీష్ శర్మ మాట్లాడుతూ ప్రాథమిక వైద్య సేవలు అందించే వేణుగోపాల్ సమాజ సేవ కార్యక్రమాల్లో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహించిన దానికి గుర్తుగా ప్రముఖ గాయకులు గజల్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అందుకోవడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శేషు స్కూల్ కరస్పాండెంట్ బోనబోయిన ఆదిశేషు, యోగ సభ్యులు జన్మి రమణయ్య, సాగల సాయి, ఒంటేరు రాజగోపాల్, జనార్దన్ రావు, పులి నాగేశ్వరరావు, చెమర్తి శ్రీనివాసులు, ఉథత జనార్దన్ రావు, పిగిలం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
