దద్దరిల్లిన ర్యాలీ
విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం భారీ ర్యాలీ
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, యూత్ డిక్లరేషన్ను అమలు చేయాలి అనే ప్రధాన డిమాండ్లతో ఈ ర్యాలీ చేపట్టారు.
ECIL X రోడ్ ( రౌండ్ బిల్డింగ్ ) వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ రాధిక X రోడ్ వరకు కొనసాగింది.
ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతకు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యలను ప్రభుత్వం సీరియస్గా పరిగణించి వెంటనే పరిష్కరించాలని కోరారు. పెండింగ్లో ఉన్న రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి, యూత్ డిక్లరేషన్ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా రీయింబర్స్మెంట్ బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని అన్నారు.
ఈ ర్యాలీలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు ,విద్యార్థులు, నిరుద్యోగ యువత, యువజన నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యార్థుల హక్కుల కోసం – యువత భవిష్యత్తు కోసం – హామీల అమలు కోసం ఐక్యంగా పోరాడుదాం అంటూ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST