హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT శాతవాహన కాలనీ లో వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల అభ్యర్థన మేరకు కాలనీలో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీ అసోసియేషన్ వారి విజ్ఞప్తి మేరకు వర్షపు నీరు కొరకు స్టార్మ్ వాటర్ లైన్ కావాలని అడుగగా అధికారులతో సమీక్షించి నూతన లైన్ నిర్మాణం కొరకు అంచనాలు సిద్ధం చేయాలని చెప్పడం జరిగింది, అలానే పార్క్ సమస్యను, మరియు నీటి మోటార్ల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది,
అలానే ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు. ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
