విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టడమే ఈ మాథెమాటిక్స్ డే..
సాక్షిత : ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం
200 పైగా నమూనాల ప్రదర్శించిన విద్యార్థులు
నెల్లూరు జిల్లా కోవూరు శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో నేషనల్ మాథెమాటిక్స్ డే సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం ఆధ్వర్యంలో నేషనల్ మాథెమాటిక్స్ డే ఏర్పాటు చేయడం జరిగింది.. దాదాపుగా 200 పైగా విద్యార్థులు మాథెమాటిక్స్ డే సంబంధించిన నమూనాలు ప్రదర్శించారు. వాటిని తిలకించిన ఉపాధ్యాయులు అనంతరం ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ.. చాలా ముఖ్యమైన రోజు శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా నేషనల్ మాథెమాటిక్స్ డే సెలబ్రేషన్. అందుగ్గాను విద్యార్థులు మేధస్సుకు పదును పెట్టి వారిలో ఉండే మేధస్సును బయటకు తీసుకురావడమే మా లక్ష్యంగా ముందుకు పోతున్నాం.. విద్యార్థులను ప్రోత్సహించడంలో శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ ఎప్పుడు ముందుంటుందని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని స్కూలుకి, తల్లిదండ్రులకు, మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు… కార్యక్రమంలో. డీ.న్.బి. మహేష్, ప్రైమరీ ఇంచార్జ్ శైలజ,ప్రీ ప్రైమరీ ఇంచార్జ్ ప్రీ సృజన,అకౌంటెంట్ యస్. డి.సాజిద్, స్టోర్ ఇంచార్జ్ మల్లి, పి ఈ టి మాస్టర్, యస్.డి సమీర్, కాంచన, విజయలక్ష్మి, అమరావతి, నైబునిస, దొరసానమ్మ, సుజిత, వంశీకృష్ణ, మహాలక్ష్మి, ఫరియాజ్, హబీబునిస, తదితరులు పాల్గొన్నారు..

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
