ఉపాధిపధకం సవరణలు తొలగించాలి,సిపిఎం నేతలు.
సాక్షిత : కోవూరుఎమ్మార్వో కి వినతి పత్రం
ఉపాధి పనులను పాత పద్ధతినే కొనసాగించాలని కోవూరు మండల తహసీల్దార్ కి సోమవారం గ్రీవెన్స్ లో వినతిపత్రం అందించారు సందర్భముగా సిపిఎం పార్టీ జిల్లాకమిటి సభ్యులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం గ్రామీణ ప్రాంత పేదలకు పనిని కల్పిస్తూ 2005 వ సంవత్సరం నుంచి గ్రామీణ ప్రాంతంలోని పేదలకు జీవనోపాధిని కల్పిస్తూ వారి జీవితాలలో వెలుగును నింపుతూ వారి ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుస్తున్నది. అలాంటి పేదలకు ఉపయోగకరమైన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు కుట్ర పన్నిందని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మండల కేద్రాలలో నిరసనలు, ఆందోళనలుకు పిలుపు నిచా రన్నారు, ఇప్పటికయినా రాష్ట్రప్రభుత్వము మోదీగారి కేద్రప్రభుత్వముపై గాంధీజీ పేరును తొలగించ కుండావత్తిడి తేవాలన్నారు పై కార్యక్రమంలో సిపిఎం కమిటీ సభ్యులు గండవరపు బుజ్జియ్య, పెద్దన్న,హరి, బాబు, జానికిరాము,విజయ్ కుమార్,గోవర్ధన్, శ్రీనివాసులు,రత్నమ్మ, సుబ్బారావు,ఏజ్దాని, మోహన్,తదితరులు పాల్గొన్నారు.

