కరెంట్ కష్టాలు తీర్చాలంటూ ఏడిఈ కాళ్ళమీద పడి వేడుకున్న రైతులు…!!!
రాత్రుళ్లు గ్రామంలో తరచూ కరెంటు వస్తూ పోతుందని, 24 గంటలు కరెంటు సరఫరా జరగటంలేదని, వ్యవసాయ క్షేత్రాలకు విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, కోతలు ఉండటంతో పంటలు ఎండుతున్నాయంటూ రైతులు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సబ్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఎంతసేపటికి ధర్నా విరమించకపోవటంతో సమాచారం అందుకున్న స్థానిక ఏడీఈ శ్రీనివాస్ సబ్ స్టేషన్ కు చేరుకోగా ఒక్కసారిగా ఆ..అధికారి కాళ్లపై రైతులు పడి విద్యుత్ ఇవ్వాల్సిందిగా కోరారు..!! వెంటనే స్పందించిన ఏడీఈ సమస్యను మౌఖికంగా తెలుసుకుని అంతరాయం లేకుండా చూస్తామనటంతో ధర్నా విరమింపజేశారు. అనంతరం ఏడీఈ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని ఫీడర్లపై ఉన్న మోటార్లు ఒక్కసారే ఆన్ చేస్తుండటంతో ఫీడర్లపై అధిక భారం పడి ట్రిప్ అవుతున్నాయన్నారు. విద్యుత్ నిరంతరం అందించటానికి విద్యుత్ శాఖ తరపున అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST