తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డులపై అవగాహన సమావేశం
సాక్షిత : ఎడ్లపడు మండల తహసీల్దార్ జె. విజయశ్రీ ఆధ్వర్యంలో, ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ షాప్ డీలర్లు, సచివాలయం సిబ్బంది మరియు గ్రామ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ముప్పాళ్ళ సుబ్బారావు, కార్యాలయ ఉప తహసీల్దార్ మరియు సివిల్ సప్లై ఉప తహసీల్దార్ అనురాధ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న నూతన రేషన్ కార్డులు (స్మార్ట్ కార్డులు) పంపిణీ విధానంపై విశదీకరించారు. కార్డుల పంపిణీకి ముందు చేయవలసిన డెస్క్ వర్క్ పై సూచనలు ఇవ్వడమే కాకుండా, ప్రతి రేషన్ షాప్‌కు ఒక సచివాలయం సిబ్బందిని అనుసంధానించారు. లబ్ధిదారులకు రేషన్ కార్డు పంపిణీ సక్రమంగా జరిగే విధంగా సచివాలయం సిబ్బంది మొబైల్ అప్లికేషన్ ద్వారా, అలాగే రేషన్ షాప్ డీలర్ల వద్ద ఉన్న ఈ-పోస్ ద్వారా కార్డుల జారీ విధానం పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు.అధికారులు ఈ కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో రేషన్ కార్డు పంపిణీ పారదర్శకంగా, సమర్థవంతంగా జరగడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
