సమాజాన్ని మేల్కొల్పి చైతన్యం చేసే విధంగా కవిత్వం ఉండాలి……….. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి
కాల గమనం పుస్తకావిష్కరణలో పాల్గొన్న సింగిరెడ్డి వాసంతి
*సాక్షిత వనపర్తి :
కవిత్వం సమాజాన్ని మేల్కొల్పేదిగా, చైతన్యవంతం చేసి స్ఫూర్తినిచ్చే విధంగా కవిత్వం రచనలు ఉండాలని డాక్టర్ కంటే నిరంజన్ అయ్యా రచించిన కాలక్రమణం పుస్తకావిష్కరణ జిల్లా కేంద్రంలోని జై భీమ్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న, మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి , సింగిరెడ్డి వాసంతి తో పాటు అతిథులు గా పాల్గొన్న పలువురు వక్తలు నేటికవులకు రచయితలకు సూచించారు అనంతరం కాలగమనం పుస్తక రచయిత డాక్టర్ కంటే నిరంజన్ అయ్యా మాట్లాడుతూ సమాజంలో నిశితంగా పరిశీలించిన అనేక రకాలైన అంశాలైనటువంటి పుట్టుక నుంచి చావు మరియు ప్రస్తుత రంగుల ప్రపంచం వరకు అన్ని అంశాలను స్పర్శించడం జరిగిందని మొత్తము 55 కవితా శీర్షికలు వేటికవే ప్రత్యేకతను సంచరించుకున్నాయని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంశాలతో మొదలుపెట్టి, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అంబేడ్కర్ రమాబాయి, చార్లీ ఛాంపియన్, స్నేహం, కుటుంబ బాధ్యత, సమాజం తీరు రాజ్యాంగం, ఓటు, ప్రేమ, తెలంగాణ పోరాటం, మనిషి జీవనం తీరు, బాధ్యత, లాంటి అనేక అంశాలను తన యొక్క సరళమైన పదాలతో హృదయానికి హత్తుకునేలా రచన చేయడం చాలా శుభపరిణామన్నారు, ఈ పుస్తకం విద్యార్థి లోకానికి సమాజానికి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని, కవిత్వం ఊహ కలిపితం కాకుండా ఆచరణ యోగ్యంగా ఉందని పుస్తకంలోని అంశాలను సమీక్షించారు. ఈనాటి ఈ కార్యక్రమానికి సఫాధ్యక్షులుగా పలుస శంకర్ గౌడ్ సాహితీ కళావేదిక అధ్యక్షులు, ముఖ్య అతిథులు ఆర్ లోకనాథ్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ మరియు ప్రముఖ ప్రజా కవి జన జ్వాల హైకోర్టు అడ్వకేట్, మరియు న్యాయవాదుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండు ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ , జై భీమ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బండారు శ్రీనివాసులు ప్రధాన కార్యదర్శి రాంబాబు సాహితీవేత్త కిరణ్ , ఎంఈఓ లు మద్దిలేటి, ఉపాధ్యాయ సంఘం నాయకులు పిఆర్టియు బౌద్ధారెడ్డి సూర చంద్రశేఖర్, రవీందర్ గౌడ్, యుటిఎఫ్ నాయకులు రవి ప్రసాద్ గౌడ్, టిపిఆర్టియు నాయకులు మహిపాల్ రెడ్డి, తపస్ నాయకులు అల్పూరి భాస్కర్, ఎస్సీ ఎస్టీ మోటర్ ఇన్ నాయకులు భోజరాజు, గంధం నాగరాజు, మాల మహానాడు నాయకులు మద్దిలేటి, రూప్ అధ్యక్షులు సుధాకర్ ఆచారి, పండిత పరిషత్ అధ్యక్షులు గిరి రాజా చారి, జై భీమ్ సంస్థ సభ్యులు కృష్ణ, ఆంజనేయులు, శ్రీకాంత్, సింగోటం రామస్వామి, రిటైర్డ్ తహసిల్దార్ కృష్ణయ్య, ఎద్దుల యాదగిరి, దాసరి కృష్ణ, నాగన్న, చెన్నమ్మ, వెంకటస్వామి, జగదీష్, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ కంట నిరంజన్ అయ్యాను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా భై రోజు చంద్రశేఖర్ వ్యవహరించారు
