మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

Sakshitha news

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఇంజనీర్స్ పాత్ర ప్రముఖమైనదని బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండాల గోపినాధ్ రెడ్డి అన్నారు. ఇంజనీర్స్ డే ని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ నాయకులు ఇంజినీర్లతో కలసి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపి మాట్లాడుతూ భారతదేశం గర్వించదగ్గ ప్రఖ్యాత ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని గుర్తుగా నేడు మనం ఇంజనీర్స్ డే ని జరుపుకుంటున్నామని వివరించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు… తిరుపతికి ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పర్యవేక్షణలో తిరుమలకు తొలిసారి ఘాట్ రోడ్ నిర్మాణం జరిగిందని గుర్తు చేసారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సారధ్యంలో దేశంలో అనేక వంతెనలు, డ్యామ్ లు, ప్రముఖ కట్టడాలు నిర్మించబడ్డాయ న్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఆయనను 1955లో భారతరత్న పురస్కారంతో గౌరవించిందని కొనియాడారు. నేటి యువతకు ఆయన స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమం లో బిజెపి నాయకులు గుండాల గోపీనాథ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, ఏ-వన్ మస్తాన్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ జిఎస్ ప్రసాద్, కూటమి నాయకులు చిత్రపు హనుమంతరావు, భాగవతుల జయలక్ష్మి, రిటైర్డ్ ఎస్పీడబ్ల్యూ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top