అశ్వరావుపేట లో పామాయిల్ రైతులకు మొక్కలు పంపిణీ కార్యక్రమం

Sakshitha news

అశ్వరావుపేట లో పామాయిల్ రైతులకు మొక్కలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి తుమ్మల…
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ స్థలాన్ని పరిశీలించనున్న మంత్రి తుమ్మల…
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అశ్వరావుపేటలో పర్యటించనున్నారు. ఈ పర్యటన లో భాగంగా పామాయిల్ డివిజన్ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యుడు జారే ఆదినారాయణ తో కలిసి పామాయిల్ మొక్కల పంపిణీని ప్రారంభించి, అక్కడ ఏర్పాటుచేసిన పామాయిల్ రైతుల సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయిల్ ఫెడ్ అధికారులతో కలిసి పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణపు స్థలాన్ని మంత్రి తుమ్మల పరిశీలిస్తారు.