తూమార్ చెరువు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి : అధికారులను ఆదేశించిన బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ …
జిహెచ్ఎంసి కొంపల్లి సర్కిల్ పరిధి దూలపల్లి డివిజన్లోని తూమార్ చెరువును బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ వివిధ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో అన్యాక్రాంతమవుతున్న చెరువు ప్రాంతాన్ని, తూము పూడ్చివేతను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చెరువులోని కొంత ప్రాంతాన్ని కొందరు వ్యక్తులు రాత్రి సమయంలో మట్టి పోసి పూడ్చి వేస్తున్నారని తద్వారా చెరువు అలుగు పారడంతోపాటు క్రింద ఉన్న తూమును పూడ్చివేయడం వల్ల చెరువులో అధికంగా ఉన్న నీరు రోడ్డు పై పారుతుందని మరోపక్క స్మశాన వాటికలోకి చెరువులోని నీరు చేరడం వల్ల దహన సంస్కారాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, ఈ సమస్యలను వెంటనే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలవకుండా సమస్యకు ప్రత్యామ్నాయ మార్గం చూపి తాత్కాలిక మరమ్మత్తులతో పాటు ప్రణాళికా బద్ధంగా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో పాటు వివిధ శాఖల అధికారులు, మాజీ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, నాయకులు బూర్గుబావి సత్యనారాయణ, చింతల దేవేందర్, రవీందర్ యాదవ్, డప్పు కిరణ్, వెంకటేష్, దుర్గా అశోక్, రాజు, లక్ష్మణ్, రాకేష్, మహేష్, శ్రీకాంత్, రఘు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
