వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం

Sakshitha news

వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం..
కోదాడ కాంగ్రెస్ నాయకులు..*ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించారు..


సాక్షిత సూర్యాపేట జిల్లా / కోదాడ
స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ప్రమీల టవర్ ఎదురుగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పట్టణ అధ్యక్షుడు వంటి పులి వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు వైస్ చైర్మన్ మల్లేశ్వరి పాల్గొని వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.

ఆరోగ్యశ్రీ,, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లేశ్వరి, కాంగ్రెస్ నాయకులు చింతలపాటి శ్రీనివాసరావు, తోట జ్యోతి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ అంబటికర్ర శ్రీనివాసరావు, ఈదుల కృష్ణయ్య ,గంధం యాదగిరి నంబూరి సూర్యం , దండా వీరభద్రం, గార్లపాటి వీరారెడ్డి ,సుందరి వెంకటేశ్వర్లు, పత్తిపాక జనార్ధన్ ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ భాయ్, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కందుల కోటేశ్వరరావు, కౌన్సిలర్స్ తూణం కృష్ణ ,ఎస్కే షాబుద్దీన్ , గంధం బాలేంద్ర పాండు, కట్టేబోయిన శ్రీనివాస్ యాదవ్ ,మూడెం సైదుబాబు ,బాయ్ జాన్, ముస్తఫా ,మాతంగి శైలజ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.