వర్షానికి వడ్లు తడిసిపోయిన రైతులు నష్టపోకుండా త్వరితగతిన ప్రణాళిక బద్దంగా కొనుగోలు చేయాలని ఆదేశించిన…….. పౌరసరఫరాల శాఖ సంచారకులు శ్యాం ప్రసాద్ లాల్
సాక్షిత వనపర్తి :
వడ్లు వర్షానికి తడిచిపోయి రైతులు నష్టపోకుండా ప్రణాళికబద్ధంగా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ సంచాలకులు శ్యాంప్రసాద్ లాల్ ఆదేశించారు.
ఐ.డి. ఒ సి కాన్ఫరెన్స్ హాల్లో ఉమ్మడి జిల్లా సివిల్ సప్లై అధికారులు, డి.యం లు, కోపరేటివ్ అధికారులు, రవాణా శాఖ అధికారులతో వడ్లు కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.
అకాల వర్షాల వల్ల వడ్లు తడిచిపోతే ప్రభుత్వానికే నష్టమని, ధాన్యం తడిచిపోయినను ప్రభుత్వం కొనుగోలు చేయక తప్పదని చెప్పారు. వర్షాకాలం ప్రారంభం కాకముందే ధాన్యం తడిచిపోకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి అయ్యేవిధంగా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న వడ్లు ఎన్ని? ఇంకా రైతుల నుండి రానున్న వడ్లు ఎన్ని అనేది ఖచ్చితమైన లెక్కలు తెలిసి ఉండాలని చెప్పారు. తేమ వచ్చిన వడ్లు వెంటనే తూకం వేసి తరలించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి ధాన్యం కొనుగోలుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని, జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడ నిల్వ చేసుకోవాలి, హమాలీల కొరత లేకుండా చూసుకోవడం, అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయడం వంటి చర్యలు జిల్లా అధికారులు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని దగ్గరలోని మిల్లులకు తరలించడానికి ట్రాక్టర్లు ఉపయోగించుకోవాలని, ధాన్యం దింపుకునే కేంద్రాల సంఖ్య సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో పెంచాలని ఆదేశించారు. రాష్ట్రంలో గన్ని బ్యాగుల కొరత లేదని వడ్లు ఎప్పటికప్పుడు తూకం వేసి కొనుగోలు చేయాలని సూచించారు. బ్లాక్ లిస్టులో ఉన్న మిల్లులో వడ్లు నిల్వ చేసుకోడానికి ఉపయోగించుకోవాలని సూచించారు. సి.యం.ఆర్ ప్రక్రియను సైతం వేగవంతం చేయాలని సూచించారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కాశి విశ్వనాథ్, మహబూబ్ నగర్ సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్, ట్రాన్స్పోర్ట్ అధికారి మానస, కోఆపరేటివ్ అధికారి బి. రాణి, నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాల పౌర సరఫరాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
