సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్: ఐడిపిఎల్ చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గౌడ కులస్తులకే పరిమితమైన నాయకుడు కాదని, సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం అందించేందుకు పోరాడిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
అనంతరం విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన నిర్వాహకులు, స్థానిక కమిటీ సభ్యులను ఆయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్దార్ పాపన్న గౌడ్ కమిటీ చైర్మన్ నందనం దివాకర్ , అధ్యక్షులు గంగా శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ విజయ శేఖర్ గౌడ్ , ఆనంద్ గౌడ్ , ప్రభా గౌడ్ , జయ శ్రీ, టీ నర్సింగరావు గౌడ్, బుర్ర మణికంఠ గౌడ్, మీ శ్యామనారాయణ గౌడ్, ప్రభు, సంతోష్, సురేష్ గౌడ్, భూషణం గౌడ్, సంజు గౌడ్, రాజు గౌడ్, లక్ష్మణ్ గౌడ్, అనిల్, శివ గౌడ కుల పెద్దలు, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
