శంకర్‌పల్లిలో సాన్స్ స్కిన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
ప్రారంభించిన సీఐ మీర్ ముదస్సర్ అలీ
సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు పోలీస్ స్టేషన్ పక్కన రామంతపూర్ వార్డులో గల సాన్స్ స్కిన్ అండ్ హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం సీఐ మీర్ ముదస్సర్ అలీ రిబ్బన్ కట్ చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం సిఐ మాట్లాడుతూ వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజల దహార్తిని తీర్చడం అభినందనీయమని తెలిపారు. ఎస్సై మంజుల మాట్లాడుతూ చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ సాయి సింధును సీఐ, ఎస్ఐలు అభినందించారు. డా. సాయి సింధు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుందని, నిత్యం పరిసర గ్రామాల నుంచి పట్టణానికి వివిధ పనుల కోసం ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పాషా, తేజ ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY