కళలు మానసిక ఆనందాన్నిస్తాయి….. సాహితి కళావేదిక
సాక్షిత వనపర్తి : కళలు మానసిక ఆనందాన్నిస్తాయని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.ప్రపంచ కళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక బాలభవన్ లో బాలభవన్ కళా సిబ్బందిని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్న విధంగా వివిధ రంగాలలో కళా సేవనందిస్తున్నవారు వనపర్తి జిల్లాలో ఎంతో మంది ఉన్నారని వారి స్పూర్తితో రానున్న తరం మన ప్రాచీన సంప్రదాయ కళలను బ్రతికిoచుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలభవన్ సిబ్బంది లావణ్య,ప్రసన్న, నిరీష,సాజిద బేగంలను శాలువ జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.వారి కళాసేవను ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కళా వేదిక ప్రతినిధులు బైరోజు చంద్ర శేఖర్,దేశి రాములు యాదవ్,బండారు శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ చారి,మద్దిలేటి, రమేష్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY