బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులను పరామర్శించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ మల్లంపేట్ లోని సాయి బాలాజీ ఎంక్లావ్ నివాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ రావును వారి నివాసంకి వెళ్ళి పరామర్శించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు మరియు ధైర్యంగా ఉండాలని త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
అనంతరం కాలనీలోని కాలనీ సభ్యులు వారు ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొన్నారు. మంచినీటి, విద్యుత్తు, చిల్డ్రన్స్ పార్కు మరియు తదితర సమస్యలు పరిష్కరించాలని వారికి తెలియజేశారు. వారు సానుకూలంగా స్పందించి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తారని తెలియజేశారు.
అనంతరం దుండిగల్ సర్కిల్ దుండిగల్ గ్రామంలో దుండిగల్ గ్రామంలోని బీఆర్ఎస్ నాయకులు వినయ్ ని వారి నివాసంకి వెళ్ళి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని, వైద్య నిమిత్తం నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వారికి ధైర్యం చెప్పి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, జక్కుల శ్రీనివాస యాదవ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, బీఆర్ఎస్ దుండిగల్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ శామీర్పేట్ రంగయ్య, జనరల్ సెక్రటరీ కొల్తూరు మల్లేష్ ముదిరాజ్, నాయకులు వీరేశ్, మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..
దుండిగల్ నివాసులు కుంటి యాదయ్య కి వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించిన రూ.2,75,000/- ఎల్ఓసి పత్రంను లబ్ధిదారులకు అందజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు శంభిపూర్ క్రిష్ణ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారు సీఎం రిలీఫ్ ఫండ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు జక్కుల కృష్ణ యాదవ్, జక్కుల శ్రీనివాస్ యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ, దుండిగల్ సర్కిల్ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ శామీర్పేట్ రంగయ్య, మాజీ ఎంపిటిసి మహేష్, మరియు తదితరులు పాల్గొన్నారు..

