శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో NGRI వద్ద నిర్వహిస్తున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామివారి ఆశీస్సులు పొందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, నియోజకవర్గంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి మరింతగా విస్తరించాలని స్వామివారిని కోరడం జరిగింది ఎమ్మెల్యే తెలిపారు.
ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొంటూ, ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత నిర్వాహకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో EO వెంకన్న BRS పార్టీ రాష్ట్ర నాయకులు ప్రవీణ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST