పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

Sakshitha news

పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.

ఉయ్యూరు పట్టణంలోనీ 3,4,10,16 వార్డుల లో పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పింఛన్లు సకాలంలో అందిస్తూ పేద కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, సయ్యద్ అజ్మతుల్లా రాజులపాటి ఫణి, ప్రవీణ్,జనసేన నాయకులు మెరుగు చినకోటయ్య,సాంబశివరావు, సుబ్బారావు,పల్యాల శ్రీను , బొమ్మసాని సురేష్,సయ్యద్ గఫూర్,రమేష్, బాలకృష్ణ,మురాల అయ్యా, చలపాటి శీను,గుర్రాల సాయిబాబు,హోటల్ ప్రసాద్,సెంట్రింగ్ శ్రీను,పుట్టి చంటి,మణి, వెంకట్,కిరణ్, అజీస్ బేగు తదితరులు పాల్గొన్నారు….,