రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి వేడుక
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని బిజెపి రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గుండాల గోపీనాథ్ మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహాకవి అని కొనియాడారు. “గీతాంజలి” రచనకు నోబెల్ బహుమతి అందుకొని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు.
దేశభక్తి, మానవతా విలువలు, విద్యా వికాసం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నార్త్ మండల అధ్యక్షుడు లోక ప్రభాకర్ నాయుడు, సెంట్రల్ మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు జయంత్ కుమార్, మిట్టపల్లి బ్రహ్మానంద రెడ్డి, రామ్ కుమార్, రవి, డీఎంకే గణేష్ రాయల్, గురునాథ నాయుడు, ప్రసాద్, చంగల్ రాయులు, రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
