అవిలాల గంగమ్మకు సారె ఊరేగింపు
** మొక్కులు తీర్చుకున్న “తుడ” చైర్మన్ దివాకర్ రెడ్డి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రూరల్ మండలం అవిలాల గ్రామ ప్రజల ఆరాధ్య దైవం, శక్తి స్వరూపిణి శ్రీ అవిలాల గంగమ్మ జాతర మహోత్సవాలు అంబరాన్నంటాయి. జాతరలో భాగంగా “తుడ” చైర్మన్ అండ్ టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి బుధవారం రాత్రి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమలతో కూడిన సారెను సమర్పించారు.
అవిలాల గ్రామానికి చేరుకున్న తుడా చైర్మన్ దివాకర్ రెడ్డికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు మంగళ హారతితో ఘన స్వాగతం పలికారు.
మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ డాలర్స్ దివాకర్ సారెను ఊరేగింపుగా తీసుకొని ఆలయానికి చేరుకున్నారు.
గంగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అవిలాల కూటమి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
