లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Sakshitha news

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

** టోల్ ఫ్రీ నెంబర్లు 0877 – 222356776, 90008 22909

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనంతో తిరుపతి నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య కోరారు. వరుసగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం ఉదయం కమిషనర్ పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి, ఎక్కడా వర్షపు నీరు నిలవకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ అల్ప పీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. నగరంలో కేశవాయన గుంట, పూర్ హోమ్ వద్ద వర్షపు నీరు రోడ్లపైకి వఛ్చినట్లు తెలియడంతో పరిశీలించి పరిష్కరించామని తెలిపారు. డ్రైనేజి కాలువల ద్వారా నీరు వస్తున్న ప్రాంతాలను తమ సిబ్బంది పరిశీలించి పరిష్కరిస్తున్నారని తెలిపారు. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి నీరు సజావుగా వెళ్లేలా చేస్తున్నామని, ప్రజలు ఇటువంటి ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాతబడిన భవనాల్లో ఎవ్వరూ ఉండకుండా, పునరావాస కేంద్రాలకు, లేదా బంధువుల ఇండ్లకు వెళ్లాలని సూచించారు. చెట్లు పడిపోయే అవకాశం ఉన్నా, డ్రైనేజీ కాలువలు పొంగినా, ఇతర సాయం కోసం కంట్రోల్ సెంటర్ ను సంప్రదించాలని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్లు 0877 222356776, 90008 22909 లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, స్మార్ట్ సిటీ ఈఈ రవి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.లు రమణ, ప్రసాద్, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, తదితరులు ఉన్నారు.