వైసీపీ నేత గౌతమ్ రెడ్డి కి సుప్రీంలో ఊరట
AP: వైసీపీ నేత, రాష్ట్ర ఫైబర్ నెట్ మాజీ ఛైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గౌతమ్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో ప్రభుత్వం.. కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.