SAKSHITHA NEWS

విజయపురం మండలం వైస్ ఎంపీపీగా వైసీపీ అభ్యర్థి కన్నెమ్మ ఏకగ్రీవ ఎన్నిక!

నగరి నియోజకవర్గంలో సత్తా చాటిన వైసిపి! రోజమ్మ నాయకత్వంలో కలిసి కట్టుగా సాగిన క్యాడర్!

నగరి నియోజకవర్గం లోని విజయపురం మండల వైస్-ఎంపీపీగా వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కోసల నగరం ఎంపీటీసీ కన్నెమ్మ ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్నికలలో ఎనిమిది మందికి గాను ఏడు మంది ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకోగా ఏడు మంది వైసీపీ అభ్యర్థిని బలపరిచారు. దీంతో ఎన్నిక ఏకగ్రీవం అయింది.

ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కన్నెమ్మకు ధృవీకరణ పత్రాలును అందజేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్.కె. రోజా ఆదేశాల మేరకు సోదరులు వై.కుమార స్వామి రెడ్డి మండలలో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు అందరూ కూడా ఎన్నికైన కన్నెమ్మ కి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.