యడ్లపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధి

Sakshitha news

యడ్లపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న తిమ్మాపురం ఆరోగ్య సచివాలయం,ZPH స్కూల్స్ నందు SNSPA ” స్వస్థ నారీ శక్తివంతమైన కుటుంబ అభియాన్ కార్యక్రమం” జరిగినది.

ఈ కార్యక్రమమునకు డా.పద్మావతి , పల్నాడు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి సందర్శించి కార్యక్రమం జరుగుతున్న విధము, రికార్డులను పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు చేశారు. చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి వారికి సరైన విధంగా వైద్యం అందుతున్న విధమును తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపురం ఆరోగ్య సచివాలయం పరిధిలో 76 మంది స్త్రీలకు వైద్య ఆరోగ్య సిబ్బందిచే అన్ని ఆరోగ్య పరీక్షలు అనగా కాన్సర్ స్క్రీనింగ్, షుగర్, బీ.పీ., హీమోగ్లోబిన్ పరీక్షలు  గర్భిణీ స్త్రీలకు TT వ్యాక్సిన్ తో పాటుగా ఐరన్, కాల్షియం బిళ్ళలు ఇచ్చుట, వారికి ఆరోగ్య పరీక్షలు, కుటుంబ నియంత్రణ సలహాలు ఇచ్చుట, వారి పరీక్షల వివరాలు RCH పోర్టల్ నందు ఆన్ లైన్ చేయుట, చిన్నారులకు వాక్సినేషన్ చేయుట, PMJAY కార్డులు,వైయో వందన కార్డ్స్ ,ఆన్ లైన్ చేసి, అవసరమైన వారికి  మందులు ఇవ్వడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, మరియు ఆశా కార్యకర్తలు పాల్గొని తమ సేవలు అందించారు.