ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణీ : ఎస్ టి సబ్‌ప్లాన్ కింద మంజూరు : తాండ్ర
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల కేంద్రంలో ములకలపల్లి పంచాయతీ ఆఫీస్ నందు స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదేశాల మేరకు ఎస్టి సబ్‌ప్లాన్ కింద మంజూరైన ఇండ్ల పట్టాలను పంపిణీ చేసిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పంచాయతీలో అందరూ శనివారం రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లతో అనేకమందికి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు,మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
