గోవు ను పూజించి పనులు ప్రారంభించడం శుభ సూచకం.
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారుని గోవు పవిత్రతకు శుభానికి చిహ్నం అని శ్రీ సాయి మందిరం అర్చకులు గంగాధర శర్మ తెలిపారు. మంగళవారం కార్తీక బహుళ ఏకాదశిని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి నగర్ లో గల శ్రీ వాసవి ఎన్ క్లేవ్ లో గోపూజ నిర్వహించారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ గోవు యొక్క పాలు, మూత్రము పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును పూజించిన రోజున పనులు ప్రారంభించడం ఎంతో శుభ సూచకంఅన్నారు. శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నాయన్నారు.
ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక గోమాత అని భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత గోవుఅన్నారు. మానవ జాతికి ఆవుకన్న మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదన్నారు. గోవులు అధికంగా క్షీరం ఇవ్వాలనీ, అవి ఎన్నడూ ఎవరిచేతా దొంగిలింపబడరాదనీ, దుష్టుల వాతపడగూడదనీ, అధిక సంతతి పొందాలనీ, యజుర్వేదంలో చేయబడిందన్నారు. యజ్ఞ యాగాదులలో హవనానికై దుగ్ధ ఘృతాలనందించే గోవు సకల ప్రాణికోటికీ జీవాధారమైనదనీ, గోసేవ వల్ల ధీరోదాత్త గుణాలు అలవడగలవనీ, ధన సంపదలు వృద్ధి పొందగలవనీ ప్రశంసించబడిందనీ తెలిపారు.ఆవు కొమ్ములు మూలంలో బ్రహ్మ, విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగమములు అలరారి వున్నాయనీ శిరస్సుకు మధ్యబాగం శంకరుని గేహ, బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వనవేదం చెబుతున్నదని పేర్కొన్నారు.
ఏక్కడైతే గోవులను పూజిస్తారో ఆ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం, శ్రీ వాసవి ఎన్ క్లెవ్ సభ్యులు మీలా లక్ష్మణ రావు,శ్రీ రాం కృష్ణా రావు,నంద్యాల నరేందర్ రెడ్డి,గుండా పరమేశ్,తాటి కొండ రమేష్ ,బ్రాహ్మదేవర మదు,మీలా శ్రీదేవి, బచ్చునీరజ,పండరి కిరణ్మయి, నంద్యాల స్వాతి,పారేపల్లి జ్యోతి,గుండా శైలజ,గుంటూరు శ్యామల,కొడిత్యాల నర్మద, బ్రహాదేవర సరస్వతి,శ్రీరామ్ రుక్మిణి,తాటి కొండ అనురాధ తది తరులు పాల్గొన్నారు.