మట్టి వినాయకుల ను పూజిద్దాం…. పర్యావరణం ను పరిరక్షిద్దాం .. PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .
…..
సాక్షిత : ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లో జలకన్య హోటల్ వద్ద సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో వినాయకచవితి పర్వదినం ను పురస్కరించుకుని మట్టి వినాయకుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , జగన్,సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి, ప్రజలకు పంపిణీ చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఓక్కరు భాద్యత తీసుకోవాలని , ఉచితంగా మట్టి వినాయకుల ప్రతిమలు పంపీణీ చేయడం చాలా సంతోషంగా ఉంది అని, మట్టి వినాయకుల పంపీణీ చేపడుతూ పర్యావారణ విషయంలో తమదైన పాత్ర పోషించడం పట్ల ప్రజలు అవగహన కలిగి ఉండలాని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, కాలనీ వాసులు ప్రతి ఒక్కరు సమాజ హితం మట్టి వినాయకులను పూజించాలని, పర్యావరణంను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.వినాయక ప్రతిమలను చేసేది మట్టితో అలకరించేది ఆకులతో, పూజించేది పూలతో ,నిమజ్జనం చేసేది నీటితో గణపతి అంటే ఆకృతి కాదు, ప్రకృతి మన సనాతన సంస్కృతి అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
మట్టి వినాయకులను పూజించి మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం మరియు చెరువులను కలుషితం చేయకుండా వీలైనంత వరుకు మట్టి వినాయకులను మన యొక్క స్వగృహం ప్రాంగణంలో నే నిమర్జనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని , అదేవిధంగా పర్యావరణ హితం మట్టి గణపతులను పూజించాలని ఈ విషయంలో మహిళలు ముందుండాలని, ప్రతి ఒక్కరికి అవగహన కలిపించాలని, మట్టి వినాయకులను పూజించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా భవిష్యత్ తరాల ను దృష్టిలో పెట్టుకొని సమాజ హితం పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ హితం ప్రతి ఒక్కరు మట్టి వినాయకులను పూజించాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన వినాయక విగ్రహాల ద్వారా చెరువులు కలుషితం అవుతాయి అని ,పర్యావరణ సమతుల్య త దెబ్బ తింటుంది అని కావున భావితరాలను దృష్టిలో పెట్టుకొని మట్టి వినాయక విగ్రహాలను ప్రతి ఒక్కరు తప్పకుండా పూజించి పర్యావరణంను పరిరక్షించాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. అదేవిధంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, మొక్కే శ్రీరామ రక్ష అని, మొక్కలు నాటడం మనందరి సామాజిక బాధ్యత అని, నాటిన మొక్కలను సంరక్షించడం మనందరి బాధ్యత అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సాంస్కృతిక సేవా సమితి సభ్యులు , కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
