రైతులకు యూరియా పంపిణీ పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై దున్నపోతుకు వినతి పత్రం అందజేసిన …….బి ఆర్ఎస్
ముందస్తు అరెస్టుల పట్ల స్టేషన్ లోనే నిరసన, వాగ్వివాదం
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని పోలీసుల పై మండిపాటు
…..
- సాక్షితవనపర్తి :
- రాష్ట్రం తో పాటు జిల్లాలో రైతులకు యూరియా నుసకాలంలో పంపిణీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు ఆడుతూప్రవేటు మార్కెట్లో అమ్ముకుంటూ కుత్రిమ కొరత ను సృష్టిస్తూ రైతులను అరిగోసపెడుతున్నాయని ఇది ఇలాగే కొనసాగితే రైతులు ఆత్మహత్యలు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై నిరసిస్తూ మంగళవారం బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరత పై రైతుల ఆవేదన ప్రతి పక్షాల నిరసనలు దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా ఉందని జిల్లా కేంద్రంలో దున్నపోతుకు వినతి పత్రాన్ని అందజేశారు అంతకుముందు జిల్లా కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద బిఆర్ఎస్ వర్గాలు నిరసనలు చేపడుతున్నాయని సమాచారంతో పోలీసులు ఉదయం 6 గంటలకు
- బి ఆర్ఎస్ నాయకుల ఇండ్ల వద్దకు చేరుకుని బిఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్టు చేసి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు దీంతో నాయకులుఅక్రమ అరెస్టుల పట్ల నిరసిస్తూ పోలీస్ స్టేషన్ లోనే నిరసనకు దిగారురైతులసమస్య లపట్ల ప్రతిపక్షం మైన తాము నిరసన లు ధర్నాలు చేపట్టడం నేరమా ఇదెక్కడి న్యాయమని ఇదెక్కడి ప్రజాస్వామ్యము అని ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు పార్టీల నిరసనలను అడ్డుకోవాలని తమకు పైనుంచి ఆర్డర్లు ఉన్నాయని పోలీసులు తెలపడంతో పోలీస్ పహారాలు ప్రభుత్వం పాలన కొనసాగించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మున్సిపల్ మాజీ చైర్మన్ గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ వాకిటిశ్రీధర్ పట్టణ అధ్యక్షులు పలుసా రమేష్ గౌడ్ మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ డేగ మహేష్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు మండి పడ్డారు అరెస్ట్ అయిన వారిలో పరంజ్యోతి మాజీ కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఉంగరం తిరుమల్, ప్రేమాత్ రెడ్డి కంచరవి స్టార్ రహీం మాధవరెడ్డి హేమంత్ ముదిరాజ్ అవిశెట్టి భాగ్యరాజ్ జోహార్ హుస్సేన్ ఇమ్రాన్ చిట్యాల రాము ఆరిఫ్ గాడిదల మోహన్ బాలరాజ్ నందిమల్ల సుబ్బు హలీం అలీమ్ అనుపటి రాము సంతోష్ ముని కుమార్ జెర్రీ సాదిక్ వాటర్ మహబూబ్ ఖాదర్ లక్ష్మణ్ గౌడ్, వెంకటేష్ తోట శీను శంకర్ , పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
