పార్టీలో జూనియర్లను కలుపుకుని వెళ్లాలి
** టీడీపీ పార్లమెంట్ సమీక్షలో “తుడ” చైర్మన్ డాలర్స్
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సమావేశం రేణిగుంటలోని వై- కన్వెన్షన్ మహల్ లో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్ లు, డైరెక్టర్లు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న “తుడ” చైర్మన్ అండ్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్, సంస్థాగత ఎన్నికల్లో 100శాతం స్ట్రైక్ రేట్ తో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత నివ్వాలని కోరారు. సీనియర్లు జూనియర్లను కలుపుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి తప్పకుండా పదవులు లభిస్తాయని పేర్కొన్నారు. యువత పూర్తిగా క్రమశిక్షణ, విలువలు కలిగిన అధినాయకులు ఉండే టీడీపీలో చేరి సమాజాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నారు. అప్పుడే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఆశయాలు నెరవేరినట్లు అవుతుందన్నారు. ఈ కార్యక్రమం లో యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, మున్సిపల్ డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, ఆముదాల తులసిరామ్, కంకణాల రజనీకాంత్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
