SAKSHITHA NEWS

నేతాజీ నగర్ కాలనీలో ప్రపంచ జల దినోత్సవం నీటి పొదుపు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న భేరి రామచందర్ యాదవ్

గచ్చిబౌలి డివిజన్ నేతాజీ నగర్ కాలనీలో వరల్డ్ వాటర్ డే నీటిని వృధా చేయకూడదు అని అవగాహన కలిగించిన కాలనీ అధ్యక్షులు భేరి రామచందర్ యాదవ్ ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జలమండలి ఆఫీస్ పెట్ డివిజన్ 15 ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల పునరుద్ధరణ ఇంకుడు గుంతల పై అవగాహన కార్యక్రమాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డ్ జలమండలి ఆధ్వర్యంలో పది రోజులపాటు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నేతాజీ నగర్ కాలనీ యందు అవగాహన ర్యాలీ మరియు ఇంటింటి ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాలనీ ప్రెసిడెంట్ రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు వారు పాల్గొని జల సంరక్షణే మన సంరక్షణ ఉపరితల , భూగర్భ జలాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉంది ప్రతి ఒక్కరు కూడా నీటి సంరక్షణ భాగస్వాములు కావాలి నీటి సంరక్షణ అనేది మానవజాతి మనుగడ కోసం వాటర్ బోర్డు దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేసి గోదావరి కృష్ణ సింగూరు నుండి నగరానికి నీరు సరఫరా చేస్తున్నారు

ఎంతో ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జల మండలి నిర్వహిస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ నీటి వృధా చేయకుండా నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కే నరసింహ యాదవ్, కాలనీ వైస్ ప్రెసిడెంట్ రాయుడు, యూత్ ప్రెసిడెంట్ డీజే భవన్, మణికంఠ, నరేష్ నాయక్, శంకర్ మార్వాడి, లక్ష్మణ్ నాయక్, వేణు మాధవ్, మహిళా సోదరీమణులు లక్ష్మమ్మ, జయమ్మ, కృష్ణవేణి, ఇందిరా బాయ్, కాలనీ పెద్దలు యువజన నాయకులు మహిళా సోదరులు మరియు కాలనీలోని ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజాహిత ఎన్జీవో హెడ్ కొండపల్లి జయశంకర్ మాట్లాడుతూ వరల్డ్ వాటర్ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి వారు హిమనీ నదాలు కాపాడండి అనే థీమ్ ని తెలియజేస్తున్నారు పర్యావరణాన్ని కాపాడినప్పుడే మంచు దిబ్బలు కాపాడబడతాయి హీమనీ నదాలు కరిగిపోయాయి అంటే భూమిపైన నీటి సాంద్రత నీటి యొక్క లభ్యత తక్కువవుతుంది తద్వారా నీటి కరువు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి వాటర్ బోర్డ్ సిబ్బంది మరియు ప్రజాహిత సభ్యులు పవన్ కుమార్, ఆదర్శ్ , క్రాంతి ఎన్జీవో జయశంకర్ పాల్గొన్నారు