
వర్క్ ఫ్రం హోం..20 లక్షల ఉద్యోగాలు
AP: ఆంధ్రప్రదేశ్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో
సుమారు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే అవకాశముందని కూటమి ప్రభుత్వం వెల్లడించింది. గృహిణులు ఇంటి పనులు చూసుకుంటూనే.. మూడు, నాలుగు గంటలు వెచ్చిస్తే వారి అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని తెలిపింది. మహిళల ఆర్థిక స్వావలంభన పెరిగేలా… పేదలకు ఆర్థిక స్వేచ్ఛ లభించేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.
