SAKSHITHA NEWS

ఎర్రగొండపాలెం లోని పెద్దమ్మ మసీద్ వెనకాల కాలనీలో 50 కుటుంబాల వరకు నివాసం ఉంటున్నారు..ఐదు రోజులకు ఒక్కసారి వదిలే నీళ్లు కనీస అవసరాలకు సరిపడే విధంగా అందించకపోవడంతో… అసహనం చెంది కాళీ బిందెలతో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు ..

మా కాలనీ కి దగ్గర లో ఉన్న ట్యాంకులో సరిపడే నీళ్లు ఉన్నప్పటికీ మాకు మాత్రం ఎందుకు నీటిని విడుదల చేయడం లో జాప్యం చేస్తున్నారని మహిళలు ప్రశ్నిస్తున్నారు…

తమ పొరుగున ఉన్న కాలనీవాసులకు మాత్రం అవసరానికి మించి నీటిని వదులుతూ మమ్మల్ని మాత్రం ఎంతలా ఎందుకు శిక్షిస్తున్నారు అని మహిళలు వాపోతున్నారు…

తక్షణమే దీనికి పరిష్కారం చూపవలసిందిగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతున్నారు..లేకపోతే… అధికారులు ముందు ధర్నా చేస్తాము అని వారు హెచ్చరిస్తున్నారు….

ఈ కాలనీవాసులు పంచాయతీని నీళ్లు కూడా రాకపోవడం మరి బాధాకరమైన విషయం విషయం…

ఎర్రగొండపాలెం యదార్ధం పత్రిక విలేకరి ఆలేటి.అనిల్ కుమార్


SAKSHITHA NEWS