కన్యకా పరమేశ్వరి ఆలయ ముందు బాగానే తొలగించి రోడ్ల విస్తరణ పూర్తి చేయాలని…….. సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జయరాములు డిమాండ్
*సాక్షిత వనపర్తి
వనపర్తి పట్టణంలో నీ రోడ్ల విస్తరణ గత ప్రభుత్వం హయాంలో చేపట్టడం జరిగింది ఇప్పటికే పెండింగ్ పనులు జరగడం లేదు అప్పటి మాజీ ఎమ్మెల్యే హైదరాబాద్ రోడ్డుపై ఉన్న దర్గాలను అలాగే ఆంజనేయం టెంపుల్ కాళీమాత గుడి మసీదులను తొలగించడం జరిగింది అలాగే కన్యక పరమేశ్వరి టెంపుల్ ముందు భాగాన్నిఇప్పటివరకు పడగొట్టలేదు వనపర్తి ఎమ్మెల్యే గెలిచి 8 నెలలు కావస్తున్న రోడ్డు పైన ఉన్న కన్యక పరమేశ్వరి ఆలయం ముందు భాగాన్ని ఎందుకు తొలగించ లేదో తెలపాలని సమాజ్వాద్ పార్టీ జిల్లా అధ్యక్షులు జానంపేట రాములు ప్రశ్నించారు.
అదేవిధంగా రోడ్డుపై పోయే బస్సులు లారీలు ఆటోలు భారీ వాహనాలకు ఇబ్బంది కలుగుతోందని రోడ్డు విస్తరణ లో భాగంగా అడ్డంగా ఉన్న కన్యక పరమేశ్వరి ఆలయ ముందు భాగాన్నితీసివేసి రోడ్డు వెడల్పు చేయాలనిఅప్పటి ఎమ్మెల్యే ఈ టెంపుల్ కొరకు స్థలం ఆలయ నిర్మాణం కోసం నిధులను కేటాయించి భూమి పూజ కూడా చేయడం జరిగింది కానీ రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఆలయ ముందు భాగాన్ని ఇప్పటివరకు తొలగించలేదని ప్రజలకు ఉన్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని రోడ్డు విస్తరణ త్వరితగతిన చేపట్టాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు టెంపుల్ ముందు దర్గాని, పక్కన ఆంజనేయులు గుడిని తీసివేశారు కాళీమాత టెంపుల్ తీసివేశారు మసీదును కూడా తీసివేశారు మళ్లీ ఈ ఆలయం ముందు భాగాన్ని ఎందుకు తొలగించడం లేదో ప్రస్తుత ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని అలాగే పాలిటెక్నిక్ నుంచి కొత్త బస్టాండ్ వరకు త్వరగా రోడ్డు వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు.