SAKSHITHA NEWS

బ్రహ్మ దేవునికి కూడా అంతుచిక్కని 2023 ఎలక్షన్లో కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు❓ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తుల తీరు

-తమ అదృష్టాలను 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరీక్షించుకోనున్న ఎమ్మెల్యే అభ్యర్థులు
సాక్షిత : కల్వకుర్తి నియోజకవర్గ రాజకీయ చదరంగంలో విజేత ఎవరు❓
నాగర్ కర్నూల్ జిల్లా నియోజకవర్గం 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కల్వకుర్తి ఎమ్మెల్యే ఎవరు నిలుస్తారోనని ప్రజల్లో చర్చలు ఊపందుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని ప్రకటించిన సంగతి పాఠకులకు విధితమే. దీంతో టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ 2023లో జరిగే ఎన్నికలలో మరోసారి కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా గురుక జైపాల్ యాదవ్ బరిలో నిలవనున్నారు. కల్వకుర్తి లోని బీసీ సామాజిక వర్గ ఓట్లను జైపాల్ యాదవ్ ఆకర్షించి తన వైపు తిప్పుకుంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈసారి కూడా మూడోసారి విజయం తననే వరిస్తుందని జైపాల్ యాదవ్ ఎదురుచూస్తున్నారు.మరోసారి భారతీయ జనతా పార్టీ నుండి కల్వకుర్తి నియోజకవర్గ తల్లోజు ఆచారి ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

ఈసారి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు ఈసారి కచ్చితంగా ఆశీర్వదిస్తారని ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపుతారని అలాగే బీసీ సామాజిక వర్గ ఓట్లు కచ్చితంగా బిజెపి పార్టీకి పడతాయని ఆశతో ఉన్నారు. గత రెండు ఎన్నికలలో విజయానికి చేరువగా వచ్చి ఓటమిపాలైన తల్లోజ్ ఆచారి స్వల్ప మెజారిటీతో ఓటమిపాలయ్యారు. 2014 అసెంబ్లీ ఎలక్షన్లలో అది కొద్ది తేడాతో 72 ఓట్ల తేడాతో ఆచారి ఓటమిపాలు అయ్యారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో జైపాల్ యాదవ్ కు అతి సమీపంగా వచ్చి రెండు నుంచి మూడు వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. రెండవ స్థానంలో నిలిచారు.ఈసారి జరగబోయే ఎలక్షన్లలో ఎలాగైనా విజయం సాధించాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు తనకే ఉంటాయని తల్లోజు ఆచారి దీమా వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ యువ నాయకులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ అన్ని పార్టీలకు దీటుగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు.

కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా వంశీ చంద్ రెడ్డి. స్థానానికి డోకా లేదు, అటు అధిష్టానం ఇటు రాహుల్ గాంధీ ఆశీస్సులు వంశీచంద్ రెడ్డికే ఉంటాయని ప్రజలు అంటున్నారు. 2014 ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఆచారి పై 72 స్వల్పఓట్ల తేడాతో గెలుపొందారు. గెలుపొందిన నాటి నుండి ప్రజల్లో మమేకమై తిరుగుతూ, ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ, ప్రజల కావాల్సిన పనులు చేయించారు. ప్రజల దృష్టిలో సుపరిచితుడుగా పేరుగాంచిన కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీ చంద్ రెడ్డి 2023లో జరిగే ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలని పావులు కదుపుతున్నారు. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలలో బరిలో నిలిచి కల్వకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు వంశీ చంద్ రెడ్డి.

“కొత్త తరం నాయకుల రాకతో పాతతరంనాయకులకు(సిట్టింగులకు) తిప్పలు”

కల్వకుర్తి నియోజకవర్గం లోని కొత్తతరం నాయకులతో పాత తరం నాయకులకు తిప్పలు తప్పేలా లేవు. కల్వకుర్తిలో ఒక బ్రాండ్ గా మారిన ఐక్యత ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. ప్రజా సేవలో సరిలేరు మీకెవరు అనే విధంగా కల్వకుర్తి ప్రజల మన్ననలు పొందుతూ నిరుపేద ప్రజల కోసం కల్వకుర్తిలో ఆరుఉచిత అంబులెన్స్ ఆమనగల్ లో 3 అంబులెన్స్ సౌకర్యం కల్పించడం జరిగింది. ప్రజాసేవలో కల్వకుర్తి నియోజకవర్గం మొత్తంలో వినిపించే పేరు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి రాకతో రాజకీయ వేడి మొదలైంది. విద్య, వైద్యం ఉపాధి రూపకల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతూ కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కలియ తిరుగుతూ ప్రజలకు చేరువా అవుతూ, కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పురాతనమైన దేవాలయాల పుననిర్మాణం, ప్రభుత్వ పాఠశాలలో రిపేర్ చేయించి వాటికి కావాల్సిన సామాగ్రిని అందజేస్తూ, వైద్యం అందించుకోవడంతో దూరమైన పేద ప్రజలకు తన సొంత డబ్బు ద్వారా వైద్యం అందేలా చేస్తూ ప్రజల కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల పొందుతున్నాడు.

సుంకి రెడ్డిరాఘవేందర్ రెడ్డి. 2023లో రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నాడు. చివరి వరకు వేచి చూడాలి ఏమైనా అద్భుతం జరుగుతుందో, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కి కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్టు దక్కితే బాగుంటుందని సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి అనుచరులు, కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలలో చర్చలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడం కోసం ఎదురుచూస్తున్నారు. సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరు నూరైనా ఈసారి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కచ్చితంగా దక్కుతుందని ఆశిస్తున్నారు. ఎలాగైనా 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని గట్టి సంకల్పంతో ఉన్నాడు. కసిరెడ్డి నారాయణరెడ్డి బరిలో దిగితే ఎమ్మెల్యే అభ్యర్థులకు తిప్పలు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కల్వకుర్తిలోని నియోజకవర్గంలో ఉప్పల ఫౌండేషన్ కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తి తీసిన వేళ కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు అపద్బాంధవుడిలా కరోనా కిట్లను పంపిణీ చేసిన ఏకైక వ్యక్తి. ఆమనగల్ లో 25 లక్షలు పెట్టి ప్రభుత్వ హాస్పిటల్ కు ఉచిత అంబులెన్స్.

నిరుపేద విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి ఎంతోమంది నిరుపేదలను చదివిస్తున్నారు.టిఆర్ఎస్ హయాంలో డబల్ బెడ్ రూము ఇండ్లు ఇస్తామని చెప్తుంటే ఏకంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి నిరుపేదలకు ఇల్లు కట్టిస్తున్న వ్యక్తి. నీరుపేద ప్రజలకు ఇంటి నిర్మాణాలు చేపడుతూ, ఆర్థిక సహాయాలు అందజేస్తూ నియోజకవర్గం లోని అన్ని గ్రామాలలో కల్య తిరుగుతూ ప్రజా ధారణ పొందుతున్న వ్యక్తి ఉప్పల వెంకటేష్. ఈసారి అసెంబ్లీ జరగబోయే ఎన్నికలలో ఎవరు నిలబడిన నిలబాడకపోయినా ఖచ్చితంగా 100% స్వతంత్ర అభ్యర్థి గా ఎమ్మెల్యే గా పోటీ చేయడం ఖాయంగా అనిపిస్తుంది. తన ఫౌండేషన్ ద్వారానే కాకుండా తలకొండపల్లి మండల కేంద్రంలో అన్ని స్థానాలు గెలిచిన జడ్పిటిసి గాను ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర నాయకులుగోలి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కష్టాలు పడి, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి తన వంతు సహాయం చేసిన గోలి శ్రీనివాస్ రెడ్డిని అధిష్టానం ఇంతవరకు గుర్తించలేదు.

ప్రస్తుత ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 2023లో జరిగే ఎలక్షన్లలో అధిష్టానం గుర్తించి తనకు కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీపారం అందిస్తారని గోలి శ్రీనివాస్ రెడ్డి ఆశిస్తున్నాడు. ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన వంతు చురుకైన పాత్ర పోషిస్తూ కల్వకుర్తి నియోజకవర్గానికి ఠాగూర్ బాలాజి సింగ్ చేసిన సేవలు ఎనలేనివి, 2018 లో జరిగిన ఎన్నికలలో ఎమ్మెల్యే టికెట్ ఠాగూర్ బాలాజీ సింగ్ కి వస్తుందని అందరూ అనుకున్న అధిష్టానం నియోజకవర్గం ఎమ్మెల్యే గూర్కా జయపాల్ యాదవ్ కు టికెట్ కేటాయించింది. ఆ సమయంలో టిఆర్ఎస్ అధిష్టానం ఠాగూర్ బాలాజీ సింగను బుజ్జగించి చారగొండ జడ్పిటిసిగా అవకాశం కల్పించింది. చారకొండ జడ్పిటిసి అభ్యర్థిగా విజయకేతనం ఎగురవేసి నాగర్ కర్నూలు జిల్లా జెడ్పి వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. మచ్చలేని నాయకుడిగా నిస్వార్థ రాజకీయ సేవకుడిగా పేరు తెచ్చుకున్న ఠాగూర్ బాలాజీ సింగ్ ను అదృష్టం వరించి జడ్పీ చైర్మన్ పద్మావతి ఎన్నికల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నాగర్ కర్నూల్ జిల్లా చైర్మన్ స్థానం ఖాళీ అవడంతో అదృష్టం ఠాగూర్ బాలాజీ సింగ్ ను వచ్చినట్టే వచ్చి చేజారింది. ఈసారి అధిష్టానం గుర్తిస్తుందని ఎమ్మెల్యే అవకాశం ఇస్తుందని ఠాగూర్ బాలాజీ సింగ్ గంపెడు ఆశలతో ఉన్నాడు. కల్వకుర్తి నియోజకవర్గం లోని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి పదుల సంఖ్యలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి రెడీగా ఉన్నారు.

కల్వకుర్తి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని బరిలో దింపాలో తెలియక అధిష్టానం కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో వరకు వేచి చూడాలి కల్వకుర్తి ఎమ్మెల్యే ఎవరో. కొత్తగా పలు రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసే ఎమ్మెల్యే అభ్యర్థులతో కొత్త తలనొప్పులు ఏర్పడ్డాయి. మొత్తానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిగా ఉండాలని కల్వకుర్తి నియోజకవర్గం 2023లోపు ఎమ్మెల్యేగా అర్హులు ఎవరు అనేది ప్రజలు తమ ఓటు ద్వారా నిర్ణయిస్తారని ప్రస్తుతానికి కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారో ఆ బ్రహ్మ దేవునికి కూడా దొరకని ప్రశ్నగా కల్వకుర్తి రాజకీయం ఉంటుందని దీనికి ఉదాహరణ నందమూరి తారక రామారావు కల్వకుర్తి నుండి పోటీ చేసి బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్ చేతిలో ఘోరంగా ఓడిపోవడం జరిగిందని మాజీ మంత్రివర్యులు చిత్తరంజన్ దాస్ కూడా ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నానని పలుసార్లు ప్రకటించడం జరిగింది. మరి కల్వకుర్తి నియోజకవర్గం లో ఈసారి జరగబోయే ఎలక్షన్ లో ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడవలసిందే. ముఖ్యంగా 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులతో ముఖ్య పార్టీల అభ్యర్థులకు తిప్పలు తప్పేలా లేవని ప్రజలు అనుకుంటున్నారు.


SAKSHITHA NEWS