హెల్మెట్ ధరించండి – ప్రాణాలను కాపాడండి.:ఎస్పీ కంచి శ్రీనివాసరావు.
పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరసరావు పేట డీఎస్పీ నాగేశ్వర రావు పర్యవేక్షణలో నరసరావు పేట లోనీ నరసరావుపేట ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ నుండి రైల్వే స్టేషన్ మీదుగా పోలీసు ప్రధాన కార్యాలయం వరకు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించిన నరసరావు పేట సబ్ డివిజన్ పోలీసులు.ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ
మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా నడిపే వారి మీద చర్యలు తీసుకుంటామని,
త్రిబుల్ రైడింగ్ నడిపే వారి మీద, సీట్ బెల్ట్ పెట్టుకోని వారి మీద, మైనర్లు వాహనాలు నడిపే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న వాటిలో మరియు ప్రమాదాల వల్ల మరణించే వారిలో ఎక్కువగా తలకు గాయాలు అయి చనిపోవడం జరుగుతుంది. దానిని నివారించాలి అంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు .
హెల్మెట్ ధరించడం వలన చిన్నచిన్న ఇబ్బందులు చూపి పక్కన పెట్టడం అనేది సరైన కారణం కాదని, ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు. ప్రాణాలను కాపాడటంలో హెల్మెట్ పాత్ర ఎంత ముఖ్యమైనదో తెలుసుకొని ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపటం వలన తలకు ఒక రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని నరసరావుపేట డిఎస్పీ నాగేశ్వరరావు తెలిపారు.
హెల్మెట్ ధరించడం వలన ఉపయోగం.
హెల్మెట్ ధరించడం వలన మీ మెదడుకు తీవ్రమైన గాయం మరియు మరణం తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఎందుకంటే పడిపోయినప్పుడు లేదా ఢీకొన్నప్పుడు, మీ తల మరియు మెదడు కంటే ఎక్కువ ప్రభావం హెల్మెట్ ద్వారా గ్రహించబడుతుంది.
అదే విధంగా మీ తల, ముఖం మరియు మెదడును గాయం నుండి రక్షించి,మిమ్మల్ని బలమైన గాయాల బారి నుండి రక్షిస్తుంది.హెల్మెట్ ధరించడం వలన ప్రమాదకరమైన సూర్య కిరణాలు(అతినీలలోహిత కిరణాలు) నేరుగా మీ కళ్ళలో పడకుండా చేసి మీ కంటి చూపును ప్రభావితం కాకుండా చేస్తుంది. హెల్మెట్ విజర్ సూర్యుని నుండి మీ ముఖానికి నీడనిస్తుంది మరియు వర్షం లేదా మంచు మీ కళ్ళలోకి రాకుండా చేస్తుంది.ఈ ర్యాలీ కార్యక్రమంలో నందు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు తో పాటు, అడ్మిన్ ఎస్పీ జె.వి సంతోష్, నరసరావు పేట డీఎస్పీ నాగేశ్వరరావు,నరసరావు పేట ట్రాఫిక్ సి.ఐ లోకనాథం మరియు నరసరావుపేట సబ్ డివిజన్ పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.