మెరుగైన వైద్యసేవలు అందించేలా కృషి చేస్తాం
హాస్పిటల్ నూతన కమిటీ సభ్యులు
సాక్షిత రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తామని, హాస్పిటల్ లో ఏవైనా లోపాలు ఉంటే అధికారులు దృష్టికి, తమ నాయకుని దృష్టికి తీసుకెళ్లి వాటికి పరిష్కార మార్గాలు చూస్తామని హాస్పిటల్ నూతన కమిటీ సభ్యులు kvv రామ కిషోర్, అనూప్ జైన్, జనసేన పార్టీ 50వ వార్డు ఇంచార్జ్ గుత్తుల సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి యొక్క సామర్ధ్యాన్ని మెరుగుపర్చడానికి కూటమి అదర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం కమిటీ సభ్యులుగా మమ్మల్ని నియమించిందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు తగిన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, అవసరమైన మందులు, పరికరాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
ఆసుపత్రిలో ఉన్న సదుపాయాలను పరిశీలించి, కొత్త పరికరాలు, బెడ్స్, ఇతర సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగుల నుండి ప్రతిస్పందనను సేకరించి, వాటిని ఆధారంగా మెరుగుదల చర్యలు చేపడతామని, రోగుల సమస్యలు, అభ్యర్థనలను పరిశీలించి, తక్షణం పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రి అధికారుల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు రాజమండ్రి నగర శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొలిశెట్టి అలివేలు రూరల్ జనసేన సెక్రటరీ, కె .విశ్వనాధం 24వార్డ్ ఇంచార్జి , తుల్లి పద్మ, కుమారి తదితరులు పాల్గొన్నారు.