మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Sakshitha news

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

సూళ్లూరుపేట

గత ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతులకు అప్పగించే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతోంది.
కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలో “వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం” పేరుతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
వినాయకుడి గుడి నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య మాట్లాడుతు
ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని,
14 సంవత్సరాలు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీని కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారని,
పేదలకు ఉచిత వైద్యవిద్య, మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం రెండేళ్లలోనే 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని అందులో ఐదు కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, మరో రెండు 90% పూర్తి అయ్యాయని, మిగిలిన పది కాలేజీలను ప్రభుత్వం పూర్తి చేయాల్సింది పోయి వాటిని ప్రైవేట్ పరం చేయాలనుకోవడం పేదల పట్ల తక్కువచూపు అని వ్యాఖ్యానించారు.
మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి రూ.4,800 కోట్లు మాత్రమే అవసరం. మూడు లక్షల కోట్ల బడ్జెట్ గల రాష్ట్రం ఈ మొత్తం ప్రజారోగ్యానికి కేటాయించలేదా?” అని ప్రశ్నించారు.
వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు.
ప్రజల సంక్షేమం విస్మరించి, స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం ఎదుర్కొంటుందని తెలిపారు. “ప్రజల మద్దతుతో ఈ పోరాటం ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు కొనసాగుతుంది” అని సంజీవయ్య చెప్పారు.

పై కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ, మండల నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top