మహబూబాబాద బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….
2009 నవంబర్ 29 చరిత్రలో ఒక గొప్ప రోజు
కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ సమాజాన్ని కదిలించిన రోజు నవంబర్ 29 దీక్షా దివాస్ ను విజయవంతం చేయాలని కోరారు
తెలంగాణ వస్తే జైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అన్నారు కేసీఆర్
కెసిఆర్ దీక్షకు ఆనాడు కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసింది
తెలంగాణ మలిదశ ఉద్యమ ఏర్పాటులో భాగంగా నిరావధిక నిరసన దీక్ష చేపట్టిన రోజు ను గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది
పార్లమెంట్లో కేసీఆర్ దీక్ష గురించి నాటి సీనియర్ పార్లమెంటు సభ్యులు ప్రస్తవించారు
200 రూపాయలు ఉన్న పెన్షన్ ను బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 చేసిన ఘనత కేసీఆర్ ది
ఇకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ వారు పింఛన్లు 2000 సరిపోవు 4000 ఇస్తానని మాయమాటలు చెప్పి మరిచిర్రు
ఇందిరాగాంధీ పేరు మీద కాంగ్రెస్ పార్టీ చీరలు పంపిణీ చేయడం సిగ్గుచేటు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారు
కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ప్రకటించిన 42% రిజర్వేషన్ ఏమైంది
బీసీలను మోసం చేస్తూ రోజుకో మాట మారుస్తున్న గొప్ప పాలకుడు రేవంత్ రెడ్డి
మొదట అసెంబ్లీ తీర్మానం, తర్వాత రాష్ట్రపతి కి పంపించడం, తర్వాత క్యాబినెట్ తీర్మానం, మళ్లీ గవర్నర్ కి పంపించడం, మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకురావడం, ఇప్పుడు 42% శాతం కాకుండ 23% రిజర్వేషన్స్ అని 17% శాతం తో గ్రామపంచాయతీ ఎన్నికలకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీ బీసీ సమాజాన్ని మోసం చేయడమే అన్నారు
బీసీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించండి
ఇస్తా అన్న తులం బంగారం ఇవ్వకపోతే తెలంగాణ ఆడబిడ్డల ముందు ముక్కు నేలకు రాయాలి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చూసి మీడిసిపడుతున్నారు మీకు అదే చివరి గెలుపు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సమిష్టిగా ముందుకు వెళుతుంది
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది వచ్చిన లీగల్ టీమ్ మరియు మేము మీకు అందుబాటులో ఉంటాం
ఉద్యమకారులను గొప్పగా గౌరవించుకున్నాం ఇక ముందు కూడా గౌరవించుకుంటాం
ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం దీక్ష దివాస్ రోజు ఏర్పాటు చేస్తాం
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్,మాజీ జడ్పీ చైర్మన్ కుమారి బిందు, మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎండి ఫరీద్, మార్నేని వెంకన్న, నాయకులు యాళ్ల మురళీధర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, ఊకంటి యాకూబ్ రెడ్డి,మార్నేని రఘు,ముత్యం వెంకన్న,అశోక్,నాయిని రంజిత్,దుర్గేశ్,తదితరులు

