SAKSHITHA NEWS

జర్నలిస్ట్ గాంధీ కుటుంబానికి అండగా ఉంటాం…
కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు..


సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)
ఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అన్నారు. గత కొన్ని రోజుల క్రితం గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో దశదినకర్మలో పాల్గొని పుల్లయ్య చిత్రపటానికి రఘు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీని పరామర్శించి అధైర్యపరవద్దని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో వారి వెంట బంక వెంకటరత్నం, పూర్ణచంద్రరావు, నాయిని మల్లయ్య, రాయలవెంకన్న, వీరబాబు , ఎస్కే సుభాని, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS