ప్రజలకు అభివృద్ధి చేసే వచ్చాం.
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు టౌన్ 16వ వార్డులో ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచారం
రెండేళ్లలో రూ.13.79 కోట్ల అభివృద్ధి పనులు, 99 శాతం హామీల అమలు
సమస్యలు తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు.
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసి, చేసిన అభివృద్ధి పనుల లెక్కతోనే ప్రజల ముందుకు వచ్చామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. సాయంత్రం కోవూరు నగర పంచాయతీ పరిధిలోని 16వ వార్డులో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. స్థానికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు ప్రజల నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకున్నామో వివరించేందుకే ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలతో పాటు దాదాపు 99 శాతం వాగ్దానాలను రెండేళ్లలోనే అమలు చేశామని చెప్పారు.సామాజిక భద్రతా పెన్షన్లను రూ.4 వేలకు పెంచడంతో పాటు దివ్యాంగులకు రూ.6 వేలు, మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేల పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ, మత్స్యకారుల సేవలో, ఆటో సేవలో, దీపం-2, పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పేదల కోసం అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించడంతో పాటు, ఇచ్చిన మాట ప్రకారమే మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. గత ప్రభుత్వంలోని వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసి, రైతులు కోరుకున్న విధంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు.
కోవూరు పంచాయతీలో అభివృద్ధి పనులు
కోవూరు పంచాయతీలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల ద్వారా మొత్తం రూ.13.79 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆయా శాఖల వారీగా చేపట్టిన ప్రధాన పనులను వివరించారు. ఇరిగేషన్ శాఖ కింద రూ.1.50 కోట్లతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇందులో రూ.50 లక్షలతో పీటర్ కెనాల్ వంతెన, రూ.48 లక్షలతో కోవూరు చెరువు బండ్ బలోపేతం, రూ.28 లక్షలతో పంట కాలువల పూడికతీత, రూ.10 లక్షలతో రక్షణ గోడలు, రూ.14 లక్షలతో పాలిచెర్ల కాలువ కల్వర్ట్ నిర్మాణం ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, ఇంతా మల్లారెడ్డి, జెట్టి రాజగోపాల్ రెడ్డి, తాటిపర్తి విజయ్ కుమార్ రెడ్డి, పబ్బారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు, నాటక రాణి వెంకట్, గాదిరాజు అశోక్, పోలిశెట్టి సుబ్బారావు, మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


