SAKSHITHA NEWS

మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.
కమిషనర్ ఎన్.మౌర్య

సాక్షిత : నగరంలో ఉత్పన్నమయ్యే మురుగునీరు డ్రెయినేజీ కాలువల ద్వారా సాఫీగా వెళ్లేలా అన్ని చర్యలు చేపడుతున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. ఉదయం 14 వ డివిజన్ లోని ఎమ్మార్ పల్లి, మజ్జిగ కాలువ, బైరాగిపట్టేడ, కేశావయన గుంట ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో కలసి డ్రెయినేజీ కాలువలను పరిశీలించారు. అలాగే 15 వ ఫైనాన్స్ నిధులతో న్యూ బాలాజీ కలని, చింతలచెను, అన్నమయ్య మార్గ్ వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రధాన మురుగు కాలువల్లో ఇప్పటికే మురుగు మట్టి, చెత్త తొలగించడం జరిగిందని అన్నారు. దీంతో మురుగు నీరు, వర్షపు నీరు రోడ్లపైకి రాకుండా సజావుగా వెళ్ళాయని అన్నారు. అదే విధంగా మిగిలిన కాలువల్లో చెత్త తొలగింపు పనులు చేపట్టాలని అన్నారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అన్నారు. 15 వ ఆర్థిక నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

కమిషనర్ వెంట మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.మహేష్, ఏసిపి బాలాజీ, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS