
సాక్షిత :అర్హులైన ప్రతి ఒక్కరికీ టి.డి.ఆర్. బాండ్లు ఇచ్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, త్వరలోనే ఇవ్వనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. టి.డి.ఆర్. బాండ్లు అర్హులైన వారికి అందించాలనే సదుద్దేశ్యంతో కార్యాలయంలో డి.సి, డి.సి.పి. ఆధ్వర్యంలో రెండు నెలలు గా ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి దరఖాస్తులను పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి వారం టి.డి.ఆర్. కమిటీ ప్రత్యక్షంగానూ, ఆన్లైన్ ద్వారా సమావేశమై చర్చిస్తున్నామని తెలిపారు. కాగా ఎక్కువ మంది నివాసయోగ్యమైన స్థలాలను, వ్యాపార యోగ్యంగా చూపడంతో టి.డి.ఆర్. బాండ్లు పంపిణీకి ఆలస్యం అవుతున్నదని తెలిపారు. ఆయా వార్డుల పరిధిలో ప్లానింగ్ సెక్రటరీ లు కూడా ఇండ్ల వద్దకే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, ప్రజలు కూడా తమ పత్రాలను ఇచ్చి సహకరించాలని తెలిపారు. మొదటి విడత కమిటీ సమావేశం కి 9 దరఖాస్తులు రాగా అందులో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న ఒక వ్యక్తికి బాండ్ ఇచ్చామని తెలిపారు. రెండవ విడత సమావేశంలో 30 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలిన పూర్తి చేసి, త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నామని తెలిపారు. టి.డి.ఆర్. బాండ్లు పంపిణీ లో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని, ఇందులో ఎటువంటి అపోహలను నమ్మవద్దని కమిషనర్ ఎన్.మౌర్య ఆ ప్రకటనలో తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app