
యువత మేలుకో – వాహన వేగాన్ని నియంత్రించుకో : జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా మేడ్చల్ రవాణా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సైకిల్ లిస్ట్ గ్రూప్ & ది రాయల్ క్లబ్ ఆఫ్ రైడర్స్ గ్రూప్ సభ్యుల భాగస్వామ్యంతో పేట్ బషీరాబాద్ లోని రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన ర్యాలీ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… రోడ్డు భద్రత సమానాలను పాటించినప్పుడే మనము సురక్షితంగా గమ్యానికి చేరుకోగలమని, తద్వారా మనతోపాటు మన కుటుంబము సంతోషంగా ఉండవచ్చన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల్లో భాగంగా వాహనాన్ని నడిపేటప్పుడు సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా వినియోగించాలని, మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని నడపవద్దని అన్నారు. ఇటీవల కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో అత్యధికులు యువకులేనని క్షణికావేశంతో వాహనాలను వేగంగా నడిపినట్లయితే ప్రమాదాలకు గురై కన్నవారికి బాధను మిగల్చవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి వెంకట్ రెడ్డి, జిల్లా రవాణా అధికారి రఘునాథన్ గౌడ్, అల్వాల్ ట్రాఫిక్ సీఐ నాగరాజు, ఎంవీఐ సాధుల శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, శ్రీనుబాబు, శిల్పా, ఉమా, శ్రీకాంత్ రెడ్డి, హైదరాబాద్ సైకిల్ లిస్ట్ గ్రూప్ సైక్లిస్ట్ రవీందర్, బైక్ రైడర్ జై భారతి, రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app