SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 30 at 12.41.44 PM

తిరుపతి నగరం

ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా బహిరంగంగా సిద్ధం చేస్తున్నామని తిరుపతి ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి నియోజక ఓటర్ల జాబితాపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ ఛాంబర్ నందు బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ హరిత మాట్లాడుతూ ఓటర్ల జాబితాను పారదర్శకంగా సిద్ధం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని, తిరుపతి నియోజకవర్గ పరిధిలో 265 పోలింగ్ కేంద్రాలకు 265 మంది బూత్ లెవెల్ ఆఫీసర్లను నియమించామని అన్నారు.

వీరు వీరి పరిధిలోని ఇంటింటికీ వెల్లి సర్వే నిర్వహించి రిపోర్ట్ సిద్దం చేసారని తెలిపారు. 18 యేళ్లు నిండి వుండి ఓటు నమోదు చేసుకోని వారి వద్ద ఫార్మ్ 6 తీసుకోని చేర్చడం జరుగుతున్నదన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి ఏమైనా అనుమానాలు ఉన్నా తమ బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కలసి నివృత్తి చేసుకోవాలన్నారు. మీకు సరైన సమాధానం దొరకని పక్షంలో నేరుగా పై అధికారులను కలసి నివృత్తి చేసుకోవాలన్నారు.

అలాగే ఎలక్షన్ డోర్ నంబర్లు ప్రతి ఇంటి వద్ద వేయించినట్లు తెలిపారు. ప్రతి ఇంటి వద్ద కొత్త మరియు పాత డోర్ నంబర్లను పెయింటింగ్ చేయించినందుకు సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. తిరుపతి నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను ఎలాంటి పొరబాట్లకు తావు లేకుండా సిద్దం చేస్తున్నట్లు తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, అర్బన్ ఎమ్మార్వో వెంకటరమణ, డి.టి.జీవన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS