SAKSHITHA NEWS

ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల్లో రెండోరోజు వాలీబాల్ ఆడిన మాజీమంత్రి ప్రత్తిపాటి

చిలకలూరిపేట : ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులకు కూటమిప్రభుత్వం నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో రెండోరోజు మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వాలీబాల్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ క్రీడా ప్రాంగణంలో బుధవారం సాయంత్రం జరిగిన క్రీడా పోటీల్లో కొండ్రు మురళి, అరవిందబాబు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావుల జట్టు వాలీబాల్ లో మెరుగైన ప్రదన్శన చేసింది. సభ్యులందరూ పోటీ పడి వాలీబాల్ ఆడి, సహచర సభ్యుల్ని, వీక్షకుల్ని ఉత్సాహపరిచారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app