వైకుంఠ ఏకాదశి పర్వదినంను పురస్కరించుకుని వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ . మరియు వారి సతీమణి శ్రీమతి శ్యామల దేవి
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు , నాయకులకు,కార్యకర్తలకు పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయభిలాషులకు వైకుంఠ ఏకాదశి పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ తెలియచేసారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి పండగ మనందరికీ ఎంతో ప్రాముఖ్యమైనది చాలా పవిత్రమైనది అని. చిత్త శుద్ధితో కల్మషం లేకుండా శ్రీ మహా విష్ణువునకు పూజాదికాలు నిర్వహించి ఉపవాసం ఉంటే.మానవ జీవితంలో ఉత్తమ ఆధ్యాత్మిక మార్గం కనుగొనవచ్చు అని. అంతే కాదు.
మహావిష్ణువు కటాక్షం కూడా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై విహరిస్తూ. మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి. భక్తులకు దర్శనం ఇస్తారని పురాణాలు చెపుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా సాక్ష్యత్తు మహా మహావిష్ణువు దర్శిస్తే..మోక్షం కలుగుతుంది అని సర్వ జనులకు శుభం కలగాలి.మహావిష్ణువు అనుగ్రహము మీకు కలగాలని కోరుకుంటున్నాను అని PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ ప్రెసిడెంట్ వడ్డేపల్లి రాజేశ్వర్ రావు , దేవి నేనీ ప్రసాద్ , సీతారామ రావు, నాని, కుమార్ తదితరులు పాల్గొన్నారు.