వైకుంఠ ఏకాదశి సందర్భంగా మల్దకల్ తిమ్మప్ప స్వామి దర్శించుకున్న..
- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ..
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజామున కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (మల్దకల్ తిమ్మప్ప) వారిని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు….అనంతరం సరితమ్మ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. స్వామి వారి అనుగ్రహంతో ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు…
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలివేలమ్మ అమరవాయి కృష్ణారెడ్డి,రామచంద్ర రెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, భగవంతు,కౌన్సిలర్ కబీర్ దాస్ అనిత నర్సింహులు,సిక్కిల మల్దకల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్,ఎల్కూర్ నర్సింహులు,ధోని ఆంజనేయులు,ఆరగిద్ద నర్సింహులు తదితరులు ఉన్నారు