SAKSHITHA NEWS

విశాలాంధ్ర” నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

132 – జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామంలోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద “విశాలాంధ్ర తెలుగు దినపత్రిక” నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేసే విశాలాంధ్ర దినపత్రిక రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర కుత్బుల్లాపూర్ జోన్ ఇంచార్జి శంకర్, రిపోర్టర్ మధు మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS