విశాలాంధ్ర దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ…
విశాలాంధ్ర దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి బాచుపల్లిలోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ జోన్ ఇంచార్జి శంకర్, రిపోర్టర్ మధు , స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ..నిత్య నూతన కథనాలతో, ప్రజా సమస్యలే పరిష్కారం లక్ష్యంగా విశాలాంధ్ర దినపత్రిక పనిచేయడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో విశాలాంధ్ర దినపత్రిక మరింత అభివృద్ధి చెందలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి , NMC అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.